1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2016 (13:56 IST)

జయలలిత ఎందుకు పెళ్లి చేసుకోలేదు : ఎంజీఆర్.. శోభన్ బాబులు మోసం చేయడం వల్లేనా?

శాశ్వతనిద్రలోకి జారుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జీవితంలో సమాధానాలు లేని ప్రశ్నలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా.. ఆమె జీవితాంతం ఎందుకు వివాహం చేసుకోలేదన్న ప్రశ్నకు ఏ ఒక్కరూ సమాధా

శాశ్వతనిద్రలోకి జారుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జీవితంలో సమాధానాలు లేని ప్రశ్నలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా.. ఆమె జీవితాంతం ఎందుకు వివాహం చేసుకోలేదన్న ప్రశ్నకు ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేరు. అయితే ఈ విషయానికి సంబంధించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జయలలిత జీవితంలో సమస్యలు ఎదుర్కోవడానికి మగవారే కారణమని ప్రచారం సాగుతోంది. 
 
ఎవరినైతే ఆమె నమ్మిందో వారి వల్లే కష్టాల పాలైందని తెలుస్తోంది. ఎంజీఆర్, శోభన్ బాబు ఇలా జయలలిత ఎంతగానో నమ్మారు. వారే ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడంలో విఫలమయ్యారని విశ్లేషిస్తున్నారు. అందుకే అప్పటి నుంచి మగవారి విషయంలో జయ కఠినంగా వ్యవహరిస్తుందని ఆమెను ఇంటర్వ్యూ చేసిన ఓ మ్యాగజైన్ రిపోర్టర్ తాజాగా గుర్తు చేస్తున్నారు.
 
తాను ఎవరినైనా త్వరగా నమ్ముతానని, కానీ ఎవరిని నమ్మాలో, నమ్మకూడదో తన జీవితమే పాఠం నేర్పిందని ఆ ఇంటర్వ్యూలో చెప్పినట్టు వెల్లడించారు. జర్నలిస్టులను కూడా జయలలిత నమ్మేవారు కాదట. ఈ విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ వాసంతి చెప్పారు. తాను ఇంటర్వ్యూ చేయడానికి 1984లో ఆమె వద్దకు వెళ్లినప్పుడు జయలలిత తన సొంత టేప్ రికార్డర్‌లో ఇంటర్వ్యూ అంతటిని రికార్డ్ చేశారని వాసంతి తెలిపారు.