సూర్య '24' చిత్రం ఓపెనింగ్స్ అదుర్స్.. ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.25 కోట్లు
విక్రమ్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించి తాజాగా విడుదలైన చిత్రం ''24''. ఈ చిత్రంలో సూర్య సరసన సమ౦త, నిత్యామీనన్ హీరోయిన్గా నటించారు. తాజాగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే దేశ వ్యాప్తంగా మొత్తం రూ.25 కోట్లను వసూలు చేసింది. సూర్య కెరీర్లో ఇంత మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
వారాంతం పూర్తయ్యేసరికి ఈ వసూళ్లు రూ.100 కోట్ల మార్కుకు చేరువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం కథ మొత్తం గడియారం అనే అంశంతో రూపొందించబడింది. ఈ చిత్రంలో సూర్య మూడు డిఫరెంట్ రోల్స్‌లో నటించి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ చిత్రాన్నిరూ.75 కోట్ల భారీ బడ్జెట్‌తో సూర్య సొంతగా నిర్మించారు.
ఈ వారంలో తెలుగు, తమిళంలో పెద్ద సినిమాలు ఏవీ విడుదల కాకపోవడంతో వచ్చేవారం వరకు కలెక్షన్ల పరంగా ఎటువంటి పోటీ ఉండదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ సినిమాకు అన్నివర్గాల నుండి పాసిటివ్ టాక్ లభించింది. చాలాకాలం నుంచి మంచి విజయాలు లేక సతమతమవుతున్న సూర్యకు ''24'' ఆ లోటును ఒక విధంగా తీర్చిందనే చెప్పాలి.