శుక్రవారం, 28 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : మంగళవారం, 3 మే 2016 (19:23 IST)

తెలుగోడి సత్తా... ఉత్తమ జాతీయ చిత్రం 'బాహుబలి', ఉత్తమ ప్రాంతీయ చిత్రం 'కంచె'..

ఎన్నో రికార్డులు నెలకొల్పిన రాజమౌళి 'బాహుబలి' చిత్రం తొలిసారిగా తెలుగు నేల నుంచి జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారాన్ని అందుకుని తెలుగోడి సత్తాను చూపింది. 63వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం నాడు దిల్లీ విజ్ఞాన భవనంలో జరుగుతోంది. అవార్డులు గెలుచుకున్న

ఎన్నో రికార్డులు నెలకొల్పిన రాజమౌళి 'బాహుబలి' చిత్రం తొలిసారిగా తెలుగు నేల నుంచి జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారాన్ని అందుకుని తెలుగోడి సత్తాను చూపింది. 63వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం నాడు దిల్లీ విజ్ఞాన భవనంలో జరుగుతోంది. అవార్డులు గెలుచుకున్న చిత్రాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా బహూకరణ జరుగుతోంది. 
 
బాహుబలి చిత్రంతో తొలిసారి ఓ తెలుగు సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం ఇదే ప్రధమం. ఈ చిత్రంతో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలుగువాడి సత్తాను చాటారు. ఇకపోతే ఉత్తమ ప్రాంతీయ చిత్రం విభాగంలో క్రిష్ దర్శకత్వంలో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన కంచె ఎంపికైంది. 
 
ఉత్తమ జాతీయ నటుడుగా అమితాబ్ బచ్చన్ పికూ చిత్రానికి ఎంపికయ్యారు. కంగనా రనౌత్‌ను ఉత్తమ నటి అవార్డు వరించింది.