బుధవారం, 26 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (15:03 IST)

రోహు చేపకు బీరు తాగించిన ప్రబుద్ధుడు (Video)

fish beer
ప్రజలు ఎంతో ఇష్టంగా ఆరగించే చేపల్లో రోహు రకం చేప ఒకటి. ఆ చేపకు ఓ ప్రబుద్ధుడు బీరు తాగించారు. ప్రజలు ఎంతో ఇష్టంగా ఆరగించే ఈ చేప పది కేజీలకు పైగా బరువు పెరుగుతుంది. అలాంటి చేపకు ఓ ప్రబుద్ధుడు బీరు తాగించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
రోహు చేపను ఓ చేత్తో పట్టుకుని, మరో చేతిలో బీరు సీసా ఎత్తి ఆ చేపకు తాగించాడు. ఈ వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అతగాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
చేపకు బీరు తాగించడం ఏంటంటూ మండిపడుతున్నారు. ప్రాణాల పట్ల ఎవరైనా హింసకు పాల్పడితే వారిపై పోరాటాలు చేసే పెటా సంస్థ ఈ వీడియోపై దృష్టిసారించాలని, సదరు వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.