Viral Video: వీడెవడ్రా బాబూ.. ఎమెర్జెన్సీ విండో ద్వారా రైలులోకి.. (video)
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రైలు రద్దీ కారణంగా ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులను రైలు కిటీకీల నుంచి రైలులోకి పంపించేశాడు.
రైలు ఎక్కేందుకు జనాలు నానా తంటాలు పడుతున్న వేళ.. ఓ వ్యక్తి తెలివిగా ఆలోచించి.. తన కుటుంబసభ్యులను ఎమర్జెన్సీ విండో ద్వారా లోపలికి పంపించేశాడు.
ముందుగా ఓ మహిళను ఎమెర్జెన్సీ విండో ద్వారా లోనికి ఎత్తి పంపాడు. తర్వాత ఓ యువకుడు, ఆపై ఓ యువతిని విండో ద్వారా రైలు లోపలికి పంపించాడు. లగేజీని కూడా ఇదే దారిలో లోనికి పంపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.