సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)
ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ చిక్కుల్లో పడ్డారు. ముంబైలో జరిగిన ఓ కన్సర్ట్‌లో సింగర్ ఉదిత్ నారాయణ్ అనుచిత ప్రవర్తించారు. దీంతో ఆయన ప్రస్తుతం ట్రోల్స్ ఎదుర్కుంటున్నారు. సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చిన మహిళా ప్రేక్షకులకు ముద్దులు పెట్టి ఉదిత్ నారాయణ అడ్డంగా బుక్కయ్యారు.
మహిళా ప్రేక్షకులకు బుగ్గపై ముద్దులు.. లిప్ లాక్‌లు ఇవ్వడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదేం పాడుబుద్ధి అంటూ ఆయనపై నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. నారాయణ్ పాటలు పాడుతుండగా కొంతమంది మహిళా అభిమానులు సెల్ఫీ కోసం దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో ఒక్కొక్కరికి చెంప మీద ముద్దు పెట్టారు ఉదిత్. ఇంతలో మర మహిళా అభిమాని దగ్గరికి వచ్చి సెల్ఫీ తీసుకున్న తర్వాత ఉదిత్‌కి బుగ్గ మీద ముద్దు ఇవ్వబోయింది.
అయితే వెంటనే ఉదిత్ ఆమె పెదవులపై ముద్దు పెట్టేశారు. ఈ పనికి ఆ అమ్మాయి షాకైంది. ప్రస్తుతం ఉదిత్ నారాయణ్ హ్యాష్ ట్యాగ్ నేషనల్ వైడ్ ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఈ ఘటనపై ఉదిత్ కూడా రియాక్ట్ అయ్యారు.
ముద్దు పెట్టే విషయంలో తనకు వేరే ఉద్దేశం లేదన్నారు. అభిమానులపై తనకున్న ప్రేమను తెలియజేసేందుకే అలా చేశానంటూ చెప్పుకొచ్చారు. అది కేవలం ఆత్మీయత, అభిమానం. నేను ఎంతో మర్యాద కలిగిన వ్యక్తిని. ఆత్మీయత అలానే వుంటుందని చెప్పుకొచ్చారు. కొంతమంది కావాలనే దీనిని వివాదం చేస్తున్నారు.