శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 జనవరి 2024 (11:04 IST)

బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా అమీర్ ఖాన్ వివాహం

ira khan marriage
బాలీవుడ్ అగ్రనటుడు అమీర్‌ ఖాన్‌ రీనా దత్తా దంపతుల కూతురు ఐరా ఖాన్‌ పెళ్లి ఇప్పుడు ఇపడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌‌గా మారింది. బుధవారం నాడు ఫిట్నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖరేను ఐరా వివాహం చేసుకున్నారు. ముంబైలోని ఓ నక్షత్ర హోటల్‌లో ఇరు కుటుంబాల సమక్షంలో వీరు రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఆ తర్వాత గ్రాండ్‌గా రిసెప్షన్‌ కూడా ఏర్పాటు చేశారు.
 
అయితే ఈ వివాహానికి జాగింగ్‌ చేస్తూ మండపానికి వచ్చాడు నుపుర్. దాదాపు 8 కిలోమీటర్ల మేరకు జాగింగ్‌ చేసుకుంటూ వచ్చిన అతడు దుస్తులు కూడా మార్చుకోకుండా జాగింగ్ దుస్తుల్లోనే పెళ్లి వేడుకలు కానిచ్చేశాడు. రిసెప్షన్‌కు మాత్రం కొత్త బట్టల్లో దర్శనమిచ్చాడు. ఇక ఈ పెళ్లి వేడుకలో అమీర్‌ ఖాన్‌ ఇద్దరు మాజీ భార్యల హాడావుడి హైలెట్ అయింది.
 
రెండో మాజీ భార్య అయిన కిరణ్‌ రావుకు ఆప్యాయంగా నుదుటన ముద్దు పెడుతూ ఫోటోలకు పోజిచ్చాడు అమీర్. ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. జనవరి 13వ తేదీన ముంబైలో బాలీవుడ్ సెలెబ్స్ కోసం గ్రాండ్‌ రిసెప్షన్‌ అమీర్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
 
నుపుర్‌ శిఖరే.. అమీర్ ఖాన్‌కు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పని చేస్తుండగా అతడితో ఐరాతో పరిచయం ప్రేమ ఏర్పడింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో 2022 నవంబర్‌లో నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు.