శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 జనవరి 2024 (18:50 IST)

కూతురిని అర్థరాత్రి కలిసిన ప్రేమికుడు.. గునపంతో చంపేసిన తండ్రి

crime
ఉత్తరప్రదేశ్‌లో పరువు హత్య చోటుచేసుకుంది. బదౌన్ జిల్లాలోని కొత్వాలి బిల్సీ ప్రాంతంలో, తన కుమార్తె ప్రేమ వ్యవహారంపై ఆగ్రహానికి గురైన తండ్రి.. ఆమె ప్రేమికుడిపై గునపంతో దాడికి పాల్పడి.. హత్య చేశాడు. ఆపై పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. 
 
వివరాల్లోకి వెళితే.. కొత్వాలి బిల్సీకి చెందిన పరౌలి గ్రామానికి చెందిన సచిన్ (20), అదే గ్రామానికి చెందిన మహేష్ కుమార్తె నీతు (20) దాదాపు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలిసింది.
 
సచిన్ నీతూ మధ్య సంబంధాల విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. వారిద్దరి ప్రేమను అడ్డుకునేందుకు కుటుంబ సభ్యులు విశ్వ ప్రయత్నాలు చేసినా వారి తరం కాలేదు. 
 
అయితే సచిన్ సోమవారం అర్ధరాత్రి నీతును ఆమె ఇంటికి కలిసేందుకు వచ్చాడు. ఆ సమయంలో అతనని నీతూ తండ్రి హతమార్చాడని విచారణలో వెల్లడి అయ్యింది.