బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2022 (21:56 IST)

బిగ్ బాస్ వల్ల నాకు ఎలాంటి మేలు జరగలేదు.. అభినయ శ్రీ

Abhinaya Shree
Abhinaya Shree
బిగ్ బాస్ సీజన్ ఆరో సీజన్.. రెండవ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగిన సంగతి తెలిసిందే. శనివారం షాని ఎలిమినేట్ కాగా.. ఆదివారం అభినయ శ్రీ బయటకు వచ్చేసింది. అయితే వీరిద్దరి ఎలిమినేషన్ అనేది ముందుగానే ప్రేక్షకులకు తెలిసిందే. 
 
మొదటి వారమే ఎలిమినేషన్ చివరి వరకు వెళ్లి తృటిలో బయటపడిన అభినయ.. సెకండ్ వీక్‌లో బయటకు వచ్చేసింది. ఇక ఎలిమినేషన్ తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్‎తో మాట్లాడిన అభినయ రెమ్యునరేషన్ గురించి స్పందించింది. అంతేకాకుండా.. బిగ్ బాస్ వల్ల తనకు ఎలాంటి మేలు జరగలేదని వాపోయింది.
 
మీకు రోజుకు రూ. 40 వేలు.. దాదాపు ఇప్పటివరకు రూ. 5 లక్షలు ఇచ్చారట కదా అని రిపోర్టర్ అడగ్గా.. అలాంటిదేం లేదని.. అవన్ని రూమర్స్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. 
 
అలాగే వినర్ ఎవరవుతారని అనుకుంటున్నారని అడగ్గా.. గీతూ.. రేవంత్ ప్రతి వారం నామినేట్ అవుతున్నారు.. సేవ్ అవుతున్నారని. వీరిలో ఒకరు కావొచ్చని.. కానీ ఇదంతా అన్ ఫేయిర్ అని తనకు అనిపిస్తుందని తెలిపింది.