1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 7 జులై 2016 (12:02 IST)

''అభినేత్రి'' ఆడియోకు అతిలోకసుందరి.. హెలికాప్టర్‌లో స్పాట్‌కు రానున్న శ్రీదేవి!!

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న అభినేత్రి సినిమా ఆడియో రిలీజ్‌కు వేళైంది. రూ. 70 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు విజయ్‌ దర్శకత్వం వహిస

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న అభినేత్రి సినిమా ఆడియో రిలీజ్‌కు వేళైంది. రూ. 70 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ  సినిమాకు విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి. సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తుండగా, ప్రభుదేవా స్టూడియోస్‌ బ్యానర్‌పై తమిళ్‌, హిందీ భాషల్లో ప్రభుదేవా నిర్మిస్తున్నారు. 
 
శరవేగంగా షూటింగ్‌ జరుపుకున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌కు ముహూర్తం ఖరారు చేశారు. ఆగస్టు 15న ఈ సినిమా ఆడియో వేడుక విజయవాడలో అట్టహాసంగా జరుగనుందని.. ఈ ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా అతిలోకసుందరి శ్రీదేవి హాజరుకానున్నట్లు తెలిసింది. విజయవాడలో ఫంక్షన్‌ జరిగే లొకేషన్‌కు డైరెక్ట్‌గా హెలికాప్టర్‌ ద్వారా శ్రీదేవిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది.