శనివారం, 5 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2023 (19:45 IST)

టీవీ నటుడు భూపీందర్ సింగ్‌ అరెస్ట్..

Bhupinder Singh
Bhupinder Singh
టీవీ నటుడు భూపీందర్ సింగ్‌ (54)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చెట్ల నరికి వేత విషయంలో వ్యక్తిన హత్య చేసిన నేరం కింద అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూపిందర్ సింగ్, అతని సర్వెంట్లు ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై లైసెన్స్ లేని అక్రమ ఆయుధాలతో 10 రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు.
 
ప్రస్తుతం బాధితులు ముగ్గురు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. ప్రధాన నిందితుడు భూపేంద్ర, అతని సర్వెంట్లను అరెస్టు చేసి కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని డీఐజీ తెలిపారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.