గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2023 (17:38 IST)

తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

revanth reddy
తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో జరుగుతున్న ఐటీ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు పెరగడం.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకి సంకేతం అని చెప్పారు. తమ గెలుపు అవకాశాలు పెరిగే కొద్దీ దాడులు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. 
 
తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలో చేరినవాళ్లు పవిత్రులు, ఇతర పార్టీల వారు ద్రోహులా? ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. తమ కుట్రలు, కక్షలతో చివరకు ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని సైతం వేధిస్తున్నారని మండిపడ్డారు.