బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2023 (18:31 IST)

మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి.. సోనియా గాంధీ సందేశం

sonia gandhi
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కీలక సందేశం అందించారు. అనారోగ్యం కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు సందేశం పంపారు. 
 
ప్రియమైన సోదర సోదరీమణులారా నేను మీ దగ్గరికి రాలేకపోతున్నాను. కానీ మీరు నా గుండెకు చాలా దగ్గరగా ఉంటారు. నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. తెలంగాణ ప్రజల కలలు సాకారం కావాలి. అమరవీరుల కృషి ఫలించాలని కోరారు.
 
అందుకు మన ప్రభుత్వం ఏర్పడాలి. తెలంగాణ సోదరులు అమ్మలు బిడ్డలకు నా విన్నపం మార్పు కోసం కాంగ్రెస్‌కు ఓటేయండి మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అని వీడియో ద్వారా సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చారు.