బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2023 (16:06 IST)

పదేళ్లలో చేసిందేమీ లేదు.. బైబై కేసీఆర్.. ప్రియాంకా గాంధీ

Priyanka Gandhi
Priyanka Gandhi
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. ప్రచారానికి నేటితో తెరపడింది. బహిరంగసభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, ర్యాలీలు, పాదయాత్రలతో హోరెత్తిన తెలంగాణ ఇవాళ్టితో మూగబోనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జహీరాబాద్‌లో పర్యటిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా ఆమె బహిరంగ సభలో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని చెప్పారు. 
 
కర్ణాటక మహిళల తరహాలో ఖాతాల్లో డబ్బులు వేస్తామన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. ధరణితో రైతుల కష్టాలు పెరిగాయన్నారు. రుణమాఫీ కాలేదని, ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని చెప్పారు. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేదని ఆరోపించారు. 
 
తెలంగాణలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని.. అవినీతి తాండవం చేస్తుందని.. ధనిక పార్టీ అయిన బీఆర్ఎస్‌ను తెలంగాణ నుంచి వెళ్లగొట్టాలని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. బైబై కేసీఆర్.. మార్పు రావాలని పునరుద్ఘాటించారు.