జయలలిత సమాధికి 'తలైవి' కంగనా పుష్పాంజలి
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ శనివార చెన్నైలో సందడి చేస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రధారిగా దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని కంగనా రనౌత్ చెన్నైకు వచ్చారు. ఈ సందర్భగా చెన్నై మెరీనా బీచ్‌లోని జయలలితతో పాటు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ సమాధి వద్ద పుష్ప నివాళి అర్పించారు.
తలైవి చిత్రం గత ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సివుంది. ఈ క్రమంలో ఈ చిత్రం ట్రైలర్‌ను కూడా ఏప్రిల్ నెలలోనే రిలీజ్ చేశారు. అయితే తలైవీ సినిమాను ఈ నెలలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నటి కంగనా.. చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఉన్న జయ సమాధి వద్దకు వెళ్లి పుష్ప నివాళి అర్పించారు.
ఏఎల్. విజయ్ డైరక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాను రూపొందించారు. కరోనా నేపథ్యంలో తొలుత తలైవీ సినిమాను ఓటీటీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా.. థియేటర్ ఓనర్ల ఆందోళనతో మొదట ఆ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు అంగీకరించారు. ఈ మూవీలో కంగనా రనౌత్‌తో పాటు అరవింద స్వామి, సామ్నా కాసిమ్, సముద్రఖని, భాగ్యశ్రీ, ప్రియమణి నటిస్తున్నారు.