దాసరి పాడెను ఆ నలుగురు మాత్రమే మోయాలి : మోహన్ బాబు
దివికేగిన దాసరి నారాయణ రావు పాడెను ఆ నలుగురు వ్యక్తులు మాత్రమే మోయాలని సినీ నటుడు మోహన్ బాబు సూచించారు. ఆ నలుగురు మినహా మిగిలిన వారెవ్వరూ ఆయన పాడెను తాకరాదన్నారు.
దివికేగిన దాసరి నారాయణ రావు పాడెను ఆ నలుగురు వ్యక్తులు మాత్రమే మోయాలని సినీ నటుడు మోహన్ బాబు సూచించారు. ఆ నలుగురు మినహా మిగిలిన వారెవ్వరూ ఆయన పాడెను తాకరాదన్నారు.
దాసరి మంగళవారం మరణించిన విషయం తెల్సిందే. ఆయన భౌతికకాయానికి మోహన్ బాబు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన కొన్ని సూచనలు చేశారు. దాసరిని మోయాల్సిన నలుగురు వ్యక్తుల పేర్లు చెబుతూ, మధ్యలో మరో ఇద్దరు పట్టుకుని ఉండాలని, ఆ ఆరుగురు మినహా మరెవరూ దాసరిని తాకడానికి వీల్లేదని అరిచి చెప్పారు.
"ఇక మనం నేరుగా గుడి దగ్గరికి వెళుతున్నాం. అక్కడ నీళ్లు చల్లిన తరువాతే కింద పెడుతున్నాం. ఎవరూ తొందరపడకండి. నిదానంగా నడవండి... గోవిందా... గోవిందా" అంటూ ఆయన దేహంతో పాటు ముందుకు సాగారు.