శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (11:15 IST)

డోనాల్డ్ ట్రంప్ నాకు ఆదర్శమంటున్న టాలీవుడ్ అగ్రహీరో ఎవరు?

డోనాల్డ్ ట్రంప్.. అమెరికా కొత్త అధ్యక్షుడు. ఈయన పేరు చెపితే అటు అమెరికా పౌరులు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల ప్రజలు సైతం బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీ

డోనాల్డ్ ట్రంప్.. అమెరికా కొత్త అధ్యక్షుడు. ఈయన పేరు చెపితే అటు అమెరికా పౌరులు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల ప్రజలు సైతం బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచం నివ్వెర పోతోంది. 
 
ఈ నేపథ్యంలో టాలీవుడ్ అగ్రహీరో డోనాల్డ్ ట్రంప్‌ను ఆదర్శంగా తీసుకున్నట్టు ప్రకటించారు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున. అభిప్రాయాల వ్యక్తీకరణలోనట. జనాలకు తనకు మధ్య అడ్డుగోడలు లేకుండా ట్రంప్ సోషల్ మీడియా ద్వారా.. తన అభిప్రాయాలు జనాలకు తెలిసేలా చేశాడని.. అదే అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయానికి కారణమైందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ట్రంప్ స్ఫూర్తితో తాను కూడా ట్విట్టర్‌లో యాక్టివ్ అయ్యానని.. మన గురించి ఎవరో చెప్పడం కన్నా.. మన సమాచారం సూటిగా జనాలకు మనమే చేరవేస్తే బాగుంటుందంటుని నాగార్జున అంటున్నాడు. 
 
మరోవైపు నాగార్జున తాజా చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' సెన్సార్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాకి క్లీన్ 'యు' సర్టిఫికెట్ లభించింది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ భక్తిరస చిత్రంలో వేంకటేశ్వర స్వామి భక్తుడైన హాధీరామ్ బావాజీ పాత్రలో కనిపించబోతున్నాడు నాగ్. ఇక ఈ సినిమాలో అనుష్క, ప్రగ్యాజైస్వాల్ కథానాయికలు కాగా.. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా.. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.