శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 3 డిశెంబరు 2018 (14:38 IST)

నాని - విక్ర‌మ్ కుమార్ మూవీకి ముహుర్తం ఖ‌రారు

నేచుర‌ల్ స్టార్ నాని - వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్లో ఓ మూవీ రానుందని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ గురించి అఫిషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంది. ఈ చిత్రానికి ప్రముఖ డీఓపీ పి.సి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వ‌ర‌లోనే ఈచిత్రం యొక్క పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.
 
ప్ర‌స్తుతం నాని జెర్సీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి గౌతమ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. నాని ఈ చిత్రాన్ని పూర్తిచేసిన వెంటనే తన 24వ చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు. మ‌రి.. విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ నానిని ఎలా చూపించ‌నున్నాడో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.