సంబంధిత వార్తలు
- మా ఎన్నికల్లో ఓటు వేశారనే షూటింగ్‌లకు హాజరుకావాలి!
- ఇసుక లారీలతో జర్నలిస్టులను తొక్కించేస్తారా? ఎంఎల్ఎ ద్వారంపూడి వ్యాఖ్యలపై నిరసన
- వారికి నచ్చిన ప్యానల్‌కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తారట : అజయ్ భూపతి
- "మా" అధ్యక్షుడుగా మనలో ఒకడు పనికిరాడా? రవిబాబు ప్రశ్న
- స్పేస్‌లో ఫస్ట్ టైమ్ మూవీ షూట్ .. అంతరిక్షంలోకెళ్లిన రష్యా నటి - డైరెక్టర్
30 ఇయర్స్ బత్తాయి బెదిరింపులు.. ఎక్కడంటే..?
మళ్ళీ అడ్డంగా దొరికిపోయారు నటుడు పృథ్వీ. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన తరువాత ఉద్యోగినులతో అసభ్యంగా ప్రవర్తించి అడ్డంగా బుక్కై చివరకు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. కొన్నిరోజుల పాటు సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. రాజకీయాల్లోనే కాదు సినిమాలకు సంబంధించిన వ్యవహారాల్లోను పెద్దగా తలదూర్చలేదు.
అయితే తాజాగా తెలుగు సినిమాకు సంబంధించి మా అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విష్ణు ప్యానల్లో వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్నారు పృథ్వీ. దీంతో ప్రకాష్ రాజ్ ప్యానల్‌పై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. కొంతమంది అసోసియేషన్ సభ్యులు నేరుగా ప్రకాష్ రాజ్‌కు సన్మానం చేయడాన్ని తప్పుబట్టారు.
పక్క రాష్ట్ర నటునికి ఎందుకు ప్రయారిటీ ఇచ్చారు. మా మెంబర్‌గా సీనియర్‌గా ఉన్నారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు. మేము 30 సంవత్సరాల సినీ పరిశ్రమలో ఉన్నాను. మీరు మేము చెప్పిందే వినాలంటూ బెదిరింపులకు దిగారు పృథ్వీరాజ్. ఈ ఆడియో కాస్త బయటకు వచ్చింది. వైరల్‌గా మారింది.
ప్రకాష్ రాజ్‌కు ఎందుకు మద్ధతిస్తున్నారు. పరభాషానటులను నెత్తిన పెట్టుకుందామా..? ఎపి మూవీ ఆర్ట్స్ అసోసియేషన్‌కు ఫోన్ చేసి మరీ బెదిరించారు పృద్వీరాజ్. విష్ణు టీమ్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్నారు పృథ్వీ. ఇప్పుడు పృథ్వీ ఆడియో కాస్త వైరల్ అవుతోంది.
