మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 జనవరి 2023 (18:34 IST)

రాహుల్ రామకృష్ణ ఇంట రెట్టింపు సంక్రాంతి సందడి..

rahul ramakrishna
ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఇంట రెట్టింపు సంక్రాంతి సందడి నెలకొంది. రాహుల్‌ తండ్రి అయ్యాడు. ఆయన భార్య హరిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రాహుల్ రామకృష్ణ తన ట్విట్టర్ వేదికగా "మగబిడ్డ.. సంక్రాంతి రిలీజ్" అంటూ పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా తన కుమారుడి ఫోటోను కూడా షేర్ చేశాడు. ఈ విషయం తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 
 
కాగా, గతంలో రాహుల్ తన ప్రియురాలికి ముద్దు పెడుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. వివాహానికి సంబంధించిన ఇతర ఏ విషయాలను బహిర్గతం చేయలేదు. కానీ, గత యేడాది నవంబరులో తన భార్య గర్భవతిగా ఉందంటూ న్యూస్ లీక్ చేశాడు.