శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

పవన్‌తో ఛాన్స్ వచ్చినా హీరోయిన్‌గా చేయను.. అలానే ఉండిపోతా.. : ప్రియాంక జవాల్కర్

priyanka jawalkar
తనకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ సరసన నటించే అవకాశం వచ్చినా తాను మాత్రం ఆయన పక్కన హీరోయిన్‌గా నటించబోనని "ట్యాక్సీవాలా" చిత్ర హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్ స్పష్టం చేశారు. దీనికి ప్రత్యేకమైన కారణం ఉందని చెప్పారు.
 
తనకు పవన్ కళ్యాణ్ అంటే పచ్చి... ఆయన నటించిన "తమ్ముడు" సినిమాను 20 సార్లు చూశాను. "ఖుషీ" చిత్రంలో ప్రతి డైలాగ్ కూడా తనకు ఇప్పటికీ గుర్తుంది. పవన్‌కు తాను వీరాభిమానిని. ఆయనని దూరం నుంచి చూస్తూ, అభిమానిస్తూ ఉండిపోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. 
 
అంతకుమించి ఏమీ కోరుకోవడం లేదని, ఒక వేళ ఆయన సినిమాలో అవకాశం వచ్చినా చేయనని చెప్పింది. అంత పెద్ద స్టార్ అయినా కూడా పవన్ అంత సింపుల్‌గా ఎలా ఉంటారో తనకు అర్థం కావడం లేదని చెప్పారు.