శుక్రవారం, 14 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ఠాగూర్

'ఆర్ఆర్ఆర్‌'కు మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు

rrr movie
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "ఆర్ఆర్ఆర్" అనేక రికార్డులను తిరగరాసింది. ఎన్నో అవార్డులను గెలుచుకుంది. తాజాగా మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. ఈ చిత్రానికి ఇప్పటికే అరుదైన గౌరవం దక్కింది. ఇటీవలే ఈ చిత్రంలోని "నాటు నాటు" పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఇపుడు మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. "క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు 2023"లో బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ చిత్రంగా పురస్కారాన్ని అందుకుంది. అలానే, ఈ చిత్రంలోని "నాటు నాటు" పాటకు బెస్ట్ సాంగ్ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని మూ టీమ్ తెలియజేస్తూ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఇందులో సంగీత దర్శకుడు కీరవాణి అవార్డును అందుకుంటున్నారు. 
 
కాగా, ఈ చిత్రానికి రెండు పురస్కారాలు దక్కడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఆస్కార్ అవార్డు కూడా దక్కించుకోవాలని వారు కోరుతున్నారు. కాగా, ప్రస్తుతం ఈ చిత్రం ఇప్పటికే ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెల్సిందే. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తర దర్శకుడు ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో ఆస్కార్ అవార్డు కోసం పోటీపడుతోంది. ఈ నెలాఖరులో నామినేషన్స్ ఫైనల్ అవుతాయి.