సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2023 (16:08 IST)

మలుపులతో కూడిన ప్రత్యర్థి ఎలా ఉందంటే, రివ్యూ

Prathyarthi
Prathyarthi
నటీనటులు: రవి వర్మ, సన, రోహిత్ బెహల్, నీలిమా, తాగుబోతు రమేశ్, అక్షత సోనావానే, టీఎన్ఆర్ తదితరులు. 
సాంకేతికత: సినిమాటోగ్రఫి: రాకేష్ గౌడ్ ఎడిటింగ్, డీఐ: రాకేష్ గౌడ్, నిర్మాతలు: సంజయ్ సాహా, ఎం రాజు నాయక్ మ్యూజిక్: పాల్ పవన్, భీమ్స్ సిసిలియో, దర్శకత్వం: శంకర్ ముడావత్ 
 
వైశాలి అనే యువతి తన భర్త విజయ్ కనిపించడం లేదని క్రైమ్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ కృష్ణ ప్రసాద్ (రవి వర్మ)కు  ఫిర్యాదు చేస్తుంది. ఎలాంటి కేసునైనా ఓకే రోజులో పరిష్కరించే కృష్ణ ప్రసాద్‌కు ఈ కేసు అంతుపట్టదు. ఈ కేసులో అనుమానం ఉన్న మెకానిక్ శివ (రవి బెహల్)తో పాటు మరో ఇద్దరు స్నేహితులు శశి, రాకేష్ అరెస్ట్ చేస్తాడు. ఇదిలా ఉండగా జర్నలిస్టు దేవ్ సింగ్ నాయక్, కృష్ణ ప్రసాద్ కూతురు హత్యకు గురవుతారు. అయితే విజయ్ కేసు విచారణలో కొన్ని విషయాలు ఎస్ ఐ. కు తెలుస్తాయి.  ఫైనల్గా అనేక మలుపులు తిరుగుతూ ఓ వ్యక్తి వద్ద కేసు సాల్వ్ అయ్యే దిశగా సాగుతుంది. అది ఎవరు? ఒక హత్యకు మరో హత్యకు లింక్ ఉండదా? అనేది మిగిలిన ప్రత్యర్థి  సినిమా. 
 
విశ్లేషణ: 
 
క్రైమ్, సస్పెన్సు కథలను ఊహించని మలుపులు ముఖ్యం. వాటిని ఎంగేజింగ్‌గా తీసాడు దర్శకుడు. ఫస్టాఫ్‌ కమర్షియల్ అంశాలతో సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్‌లో విజయ్ మిస్పింగ్ కేసు ఉన్న సీరియస్ అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. సమాజాల్లో జరిగే రేప్, హత్యలు సాల్వ్ కావడం కష్టం. కానీ సినిమా పరంగా ఎలా సాల్వ్ చేయాలో చూపించాడు. కొన్ని జరిగిన సంఘటనలు తీసుకుని చేసిన సినిమాగా చెప్పవచ్చు.  ట్విస్టులను డీల్ చేయడంలో దర్శకుడు శంకర్ ముడావత్ అనుసరించిన స్క్రీన్ ప్లే బాగుంది.  మలుపులో ఆసక్తిని కలిగించేలా చేసాడు. ఇందులో అందరూ ఫెర్ఫార్మెన్స్ బయట పెట్టారు. ఆ దశలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. బడ్జెట్ పరంగా కాస్త ఎక్కువ పెడితే పెద్ద సినిమా అయ్యేది. 
 
 రవివర్మ కు ప్రత్యర్థి సినిమా కీలకం. తానే కథను మోశాడు. రోహిత్ బెహల్ చక్కటి నటనతో అలరించాడు. విజయ్ ప్రియురాలు రేచల్, కృష్ణ ప్రసాద్ కూతురుగా నిత్య ఆకట్టుకొన్నారు. సన ఈ సినిమాలో ఎమోషనల్ పాత్రతో మెప్పించింది. సంగీతం కూడా సరిపోయింది. మర్డర్ మిస్టరీకి కావాల్సిన డార్క్ మూడ్‌ను క్రియేట్ చేయడంలో రాకేశ్ గౌడ్ కెమెరా పనితనంతో మెప్పిస్తాడు. మిగితా సాంకేతిక అంశాలు కూడా చిన్న బడ్జెట్ చిత్రానికి ఉండే ఫీల్‌ను కలిగించాయి. సంజయ్ సాహా, ఎం రాజు నాయక్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. చిన్న బడ్జెట్ చిత్రమైనా మంచి ఫీల్‌గుడ్ అంశాలను, ప్రామాణాలను పాటిస్తూ గాలు పాలు డ్రీమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తన ప్రత్యేకతను చాటుకొన్నది.
 
ఏదిఏమైనా చిన్న బడ్జెట్‌ సినిమాలకు, అందులోనూ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలకు ఆసక్తికరంగా తీయడం ముఖ్యం. దర్శకుడు మొదటిసారి అయినా బాగానే తీశాడు. అయితే ఈ దశలో కొన్ని లోపాలు వదిలేశాడు. చిన్న చిత్రాలకు వుండే పరిమితులేకారణంగా కనిపిస్తున్నాయి. మర్డర్‌ మిస్టర కథ అనేది ఎటువంటి హీరోకైనా సేఫ్‌ చిత్రంగా వుంటున్న ఈరోజుల్లో దర్శకుడు చేసిన ప్రయత్నం అభినందనీయం. ఈ తరహా సినిమాలు మెచ్చేవారికి ప్రత్యర్థి మెప్పిస్తుంది.  
 
రేటింగ్: 2.75/5