శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (16:49 IST)

'రేసుగుర్రం' విలన్‌ను ముంచేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం "రేసుగుర్రం". సూపర్ డూపర్ హిట్ అయిన్ ఈ చిత్రంలో విలన్‌గా రవికిషన్ నటించాడు. ప్రస్తుతం ఈ విలన్‌ను ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కోటిన్నర రూపాయల మేరకు మోసం చేశాడు. ఈ విషయాన్ని రవికిషన్ స్వయంగా బయటపెట్టాడు. 
 
ముంబైలో ఓ ఫ్లాట్ కొనుగోలు నిమిత్తం కమల ల్యాండ్ మార్క్ గ్రూపు అనే రియల్ ఎస్టేట్ సంస్థకు అడ్వాన్స్ రూపేణా రూ.1.50 కోట్లను చెల్లించాడు. ఆ తర్వాత ఆ సంస్థ ఆయనకు ఫ్లాట్ కేటాయింపు లేఖ కూడా ఇచ్చింది. 
 
కానీ, ఫ్లాటు మాత్రం ఇప్పటివరకు అప్పగించలేదు. దీంతో ఆయన ఆరా తీయగా అసలు విషయం వెల్లడైంది. ఆ సంస్థ నకిలీదని తెలుసుకున్న రవికిషన్ లబోదిబోమంటూ ముంబై పోలీసులను ఆశ్రయించాడు.