శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 3 డిశెంబరు 2018 (19:41 IST)

అఖిల్ మూవీపై క్లారిటీ ఇచ్చిన బోయ‌పాటి

అక్కినేని అఖిల్ న‌టిస్తోన్న తాజా చిత్రం మిస్ట‌ర్ మ‌జ్ను. ఈ చిత్రానికి తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 3కి షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. జ‌న‌వ‌రి 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.... ఈ సినిమా త‌ర్వాత అఖిల్ బోయ‌పాటితో సినిమా చేయ‌నున్నాడు అని ప్ర‌చారం జ‌రుగుతోంది.
 
ఈ ప్ర‌చారంపై బోయ‌పాటి స్పందించాడు. ఇంత‌కీ ఏమన్నాడంటే... ప్ర‌స్తుతం దృష్టి అంతా రామ్ చ‌ర‌ణ్‌తో చేస్తోన్న సినిమా మీదే ఉంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా త‌ర్వాత బాల‌కృష్ణ‌తో సినిమా చేయ‌నున్నాను అని చెప్పాడు. సో... బోయ‌పాటి మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే.. అఖిల్‌తో సినిమా ఇప్ప‌ట్లో లేన‌ట్టే.