శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 9 నవంబరు 2018 (12:36 IST)

'ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల...'... "వినయ విధేయ రామ" టీజర్ రిలీజ్

"రంగస్థలం" వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం "వినయ విధేయ రామ". ఈ చిత్రానిక బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి బరిలో నిలువనున్న ఈ చిత్రం టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
"అన్నయ్య వీడిని చంపెయ్యాలా? భయపెట్టాలా?" అనే డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. "భయపెట్టాలంటే 10 నిమిషాలు చంపేయాలంటే పావుగంట. ఏదైనా ఓకే సెలక్ట్ చేసుకో" అంటూ చెర్రీ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. 'ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల’ అంటూ చెర్రీ మాస్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాడు. వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. సీనియర్ నటుడు ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేశ్‌, స్నేహ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.