మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 6 నవంబరు 2018 (13:53 IST)

వినయ విధేయ రామ ఫస్ట్ లుక్ ఎలా వుందో చూడండి..

''రంగస్థలం'' సినిమా తర్వాత రామ్ చరణ్ నటించే సినిమా వినయ విధేయ రామ. ఈ సినిమాకు బోయపాటి శీను దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, చరణ్ సరసన కథానాయికగా కైరా అద్వాని కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. 
 
బోయపాటి యాక్షన్ మార్కుకు తగినట్టుగా, శత్రువులపై విరుచుకుపడుతున్నట్లు చరణ్ ఈ పోస్టర్లో కనిపించాడు. చెర్రీ లుక్ తన అభిమానులను ఖుషీ చేస్తున్నట్లు వుంది. ఈ సినిమా నుంచి ఈ నెల 9వ తేదీన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. 
 
వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ప్రశాంత్ .. స్నేహ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.  స్నేహ, జీన్స్‌ ఫేమ్‌ ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.