ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 7 నవంబరు 2018 (15:01 IST)

చెర్రీ - అఖిల్ మధ్య వార్.. నువ్వా నేనా తేల్చుకుందామంటున్న హీరోలు...

మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్, అక్కినేని కుటుంబ కథానాయకుడు అఖిల్‌ల మధ్య వెండితెర ప్రచ్చన్న యుద్ధం మొదలైంది. ఆ వార్ నువ్వా నేనా తేల్చుకుందామన్న స్థాయికి చేరుకుంది. ఇతకీ మంచి స్నేహితులైన ఈ ఇద్దరు హీరోల మధ్య ఎందుకు వివాదం చెలరేగిందో ఓ సారి తెలుసుకుందాం. 
 
అఖిల్ అక్కినేని తన మూడో చిత్రం "మిస్టర్ మజ్ను"తో బిజీగా ఉన్నాడు. తన రెండు చిత్రాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈ చిత్రాన్ని అఖిల్ ఓ సవాల్‌గా తీసుకుని రేయింబవుళ్లూ కష్టపడుతున్నాడు. 'తొలి ప్రేమ' వంటి సూపర్ హిట్ చిత్రం తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూడో సినిమా తెరకెక్కుతుంది. "మిస్ట‌ర్ మ‌జ్ను" అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం అభిమానుల‌ని అల‌రించేలా ఉంటుంద‌ని అంటున్నారు. దీపావ‌ళి శుభాకాంక్ష‌ల‌తో చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో అఖిల్ కొత్తగా క‌నిపిస్తుండగా, ఈ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతి బరిలో నిలువనుంది. 
 
ఇకపోతే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన తదుపరి చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం కూడా వచ్చే యేడాది సంక్రాంతి బరిలో నిలువనుంది. దీంతో చెర్రీ - అఖిల్‌ల మధ్య వెండితెర వార్ నెలకొంది. ఈ ఇద్దరు కుర్ర హీరోలు తమతమ ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నారు. ఫలితంగా ఈ ఇద్దరి హీరోల మధ్య వెండితెర పోటీ నెలకొంది.