సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 8 నవంబరు 2018 (14:44 IST)

కైరా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రాల పెళ్ళెప్పుడు..? అలియా భట్ ఏం చెప్పింది?

''భరత్ అనే నేను'' సినిమాలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటించిన కైరా అద్వానీకి త్వరలో పెళ్లి కుదరనుందని టాక్ వస్తోంది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు దక్కించుకుంటూ వస్తోన్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్‌లో వుందని సమాచారం. త్వరలో వీళ్లిద్దరూ వివాహం చేసుకోబోతారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. 
 
ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ ఈ జంటని ఒక్కటి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని బీటౌన్‌ వర్గాల సమాచారం. కానీ ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమేనని అప్పట్లో కొట్టిపారేసింది.. ఈ జంట. తాజాగా సిద్ధార్థ్ మాజీ ప్రేయసి అలియా భట్ చేసిన వ్యాఖ్యలతో సిద్ధార్థ్, కైరాల మధ్య రిలేషన్ ఉందని తెలుస్తోంది. 
 
''కాఫీ విత్ కరణ్'' కార్యక్రమానికి హాజరైన అలియా భట్‌ని.. సిద్ధార్థ్ ఎవరితో డేటింగ్ చేయడానికి ఇష్టపడతాడని ప్రశ్నించగా.. ఆమె కైరా అద్వాని పేరు చెప్పింది. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ నిజమేనని తేలిపోయింది. కానీ కైరా మాత్రం ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టి పెట్టానని.. ప్రేమ, పెళ్ళిపై వస్తున్న వార్తలన్నీ వదంతులేనని వెల్లడించింది.
 
భరత్ అనే నేను సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన కైరా, ప్రస్తుతం రామ్ చరణ్, బోయపాటి సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ సెట్స్ పై ఉంటుండగానే ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు కైరాను వరించనుంది. అదే మహేష్-సుకుమార్ సినిమా. మహర్షి పూర్తయిన తర్వాత మహేష్‌తో సినిమా చేయనున్నాడు. దీంతో మహేష్‌తో రెండోసారి నటించనుందని సమాచారం.