మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 జూన్ 2018 (13:45 IST)

నటులను లైంగికంగా వేధిస్తున్న హీరోయిన్లు... 'రేసుగుర్రం' మద్దాలి శివారెడ్డి

అల్లు అర్జున్ నటించిన చిత్రం "రేసుగుర్రం". ఈ చిత్రంలో విలన్‌గా మద్దాలి శివారెడ్డి పాత్రలో ఒదిగిపోయిన విలన్ రవికిషన్. ఈయన తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ బాధితుల్లో కేవలం

అల్లు అర్జున్ నటించిన చిత్రం "రేసుగుర్రం". ఈ చిత్రంలో విలన్‌గా మద్దాలి శివారెడ్డి పాత్రలో ఒదిగిపోయిన విలన్ రవికిషన్. ఈయన తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ బాధితుల్లో కేవలం నటీమణులు మాత్రమే లేరనీ నటులు కూడా ఉన్నారని తెలిపారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కాస్టింగ్ కౌచ్ ఆడవారికే కాదు, మగవారికీ ఎదురవుతోందని ఆయన సంచలన కామెంట్ చేశారు. మగవారిని లైంగికంగా వేధించే హీరోయిన్ల సంఖ్య సినీరంగంలో ఎక్కువగాఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
కాగా, తెలుగు, హిందీ, బోజ్‌పూరీ భాషలలో పలుసినిమాలలో రవికిషన్‌ నటించారు. ఈరంగంలో ఎంతో అనుభవమున్న రవికిషన్‌ మాటలు నమ్మాల్సిందేనని సినీజనాలు అంటున్నారు. కాకపోతే తనకే (రవికిషన్) ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయా లేదా మరెవరికైనా ఎదురయ్యాయా అన్నది మాత్రం తేలాల్సి వుంది.