సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 5 జులై 2017 (21:11 IST)

భరత్ ఇంటిలోనే పెద్దఖర్మ... రవితేజకి మళ్లీ చెడ్డ పేరు...

రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆఖరి చూపు కూడా చూడలేదంటూ మీడియా నానా రచ్చ చేసిందంటూ తాజాగా రవితేజ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇకపోతే తన సోదరుడి 11వ రోజు పెద్దకర్మను భరత్ ఇంట్లోనే నిర్వహించారు. దీనికి రవితేజ హాజరయ్యాడు. తన సోదరుడి ఫోటోకి దండ

రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆఖరి చూపు కూడా చూడలేదంటూ మీడియా నానా రచ్చ చేసిందంటూ తాజాగా రవితేజ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇకపోతే తన సోదరుడి 11వ రోజు పెద్దకర్మను భరత్ ఇంట్లోనే నిర్వహించారు. దీనికి రవితేజ హాజరయ్యాడు. తన సోదరుడి ఫోటోకి దండ వేసి నమస్కరించాక మీడియాతో మాట్లాడాడు. 
 
ఇంతకుముందే నా తమ్ముడు మరణించినప్పుడు ఎందుకు రాలేకపోయాను చెప్పాను. దీని గురించి ఎవరికి తోచినట్లు వారు రాసుకున్నారు. కొందరు విపరీతార్థాలు తీశారు అని అనగానే కొంతమంది అలా రాసి వుండవచ్చు కానీ అంతా అలా రాయలేదు కదా అని అనేసరికి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. 
 
రవితేజ సంగతి అలా వుంచితే ఆయన సిబ్బంది కూడా మీడియా పట్ల కాస్త కఠినంగా వ్యవహరించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మొత్తమ్మీద తమ్ముడి మరణం వల్ల రవితేజ ఇంకా చెడ్డపేరు తెచ్చుకుంటూ వున్నట్లు కనబడుతున్నాడు.