20 యేళ్ళ సినీ ప్రస్థానం, ఒక్క సినిమాతో తలకిందులు?
అతనో కమెడియన్. చూసేందుకు హీరోలా ఉంటాడు కానీ.. హీరో పక్కన కమెడియన్‌గా బాగా షూటవుతాడు. అలా డైరెక్టర్లు అతనికి క్యారెక్టర్లను రెడీ చేస్తారు. ఇక ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయి నటిస్తుంటాడు కమెడియన్. ఇలా 20 యేళ్ళ పాటు కమెడియన్ గానే కాదు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.
అంతటితో ఆగలేదు దర్సకుడు, నిర్మాతగా కూడా ప్రయత్నాలు చేశాడు. డబ్బులు సంపాదించుకుని సినీపరిశ్రమలో నిలదొక్కుకుందామనుకున్నాడు. అయితే చివరకు ఒక్క సినిమాతో అతని పరిస్థితి తలకిందులుగా మారిపోయింది. ఇదంతా ఎవరో కాదు శ్రీనివాసరెడ్డి. తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు శ్రీనివాస రెడ్డి.
కమెడియన్‌గా శ్రీనివాసరెడ్డి అంటే తెలుగు సినీపరిశ్రమలో తెలియని వారండరు. అంతో ఇంతో కమెడియన్‌గా డబ్బులు సంపాదించుకున్న శ్రీనివాస రెడ్డి చివరకు ఒక్క సినిమాకు నిర్మాతగా మారి చివరకు అంతా పోగొట్టుకున్నాడు. ఆ సినిమా భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు. ఈ సినిమా కాస్త శ్రీనివాసరెడ్డి జీవితంలో చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆయన్ను లేవలేని స్థితిలోకి తీసుకెళ్ళింది. ఆ విషయాన్ని శ్రీనివాసరెడ్డే స్వయంగా చెప్పారు.
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో టివీలు చూడడం పూర్తిగా మానేశా. బయటకు అస్సలు వెళ్ళడం లేదు. ఏదో ఇంట్లో ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటున్నాము. నేను నా భార్య, రెండేళ్ళ బిడ్డ మాత్రమే ఇంట్లో ఉంటున్నాము. కరోనాతో చాలామంది చనిపోతున్నారని స్నేహితులు ఫోన్ చేస్తే బాధనిపిస్తోంది. అందుకే యు ట్యూబ్‌లో వీడియోలు.. టివిలు చూడటం పూర్తిగా మానేశానంటున్నాడు. ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని... ఇంట్లోనే సేఫ్‌గా ఉండాలని కోరుతున్నాడు.