గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (19:06 IST)

సూర్య రెండో పెళ్లి గురించి తెలుసా?

surya-jyothika
స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక 2006లో వివాహం చేసుకున్నారు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంతేకాకుండా ఈ జంటకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సూర్యకి లేడీ ఫాలోయింగ్ ఇంకొంచెం ఎక్కువే ఉంది. 15 ఏళ్లు గడిచిన వీరి వైవాహిహక జీవితంలో ఎన్నో స్వీట్ మెమోరీస్ ఉన్నాయి
 
అయితే వీళ్ల గురించి చాలా మందికి తెలియని విషయం ఒక్కటి ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన భార్య జ్యోతికను రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు. ఈ సంగతి బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. వీళ్లు ప్రేమించుకునే రోజుల్లోనే సూర్య ఇంట్లో ఎవ్వరికి తెలియకుండా జ్యోతిక మెడలో మూడు ముళ్లు వేసేసారట. 
 
ఇంట్లో పెద్దవాళ్లకి తమ ప్రేమ విషయం చెప్పడానికి బయపడి ఇలా గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నారట. ఆ తరువాత ఈ సంగతి వాళ్ల నాన్నకు తెలిసి..ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా..ఇక చేసేది ఏం లేక..మళ్ళీ అందరి ముందు వీరికి ఘనంగా పెళ్లి జరిపించారట. అలా సూర్య జ్యోతికను రెండు సార్లు పెళ్ళి చేసుకున్నారన మాట.