బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 5 ఏప్రియల్ 2017 (07:22 IST)

ఆ విషయం చెప్పకపోతే జీవితాంతం చస్తూ బతికేదాన్ని: ఆ ధైర్యానికి సెల్యూట్

ఓ కాళరాత్రి తన జీవితాన్ని బుగ్గిపాలు చేయచూసిన ఆ అమానుషం గురించి బయటికి చెప్పకుండా ఉండి ఉంటే జీవితాతం తప్పుచేశాననే బాధతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చేది. అందుకే ధైర్యంగా పోలీసుల వద్దకెళ్లి ఆ ముష్కర చర్య గురించి ఫిర్యాదు చేశాను అని తెలిపారు మ

ఓ కాళరాత్రి తన జీవితాన్ని బుగ్గిపాలు చేయచూసిన ఆ అమానుషం గురించి బయటికి చెప్పకుండా ఉండి ఉంటే జీవితాతం తప్పుచేశాననే బాధతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చేది. అందుకే ధైర్యంగా పోలీసుల వద్దకెళ్లి ఆ ముష్కర చర్య గురించి ఫిర్యాదు చేశాను అని తెలిపారు మలయాళ హీరోయిన్ భావన. ఫిబ్రవరి నెలలో కారులో కొందరు ఆమెను లైంగికంగా వేధించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. తనకు జరిగిన ఘోర అవమానాన్ని దాచిపెట్టకుండా బహిర్గతం చేసిన భావన సాహసాన్ని, ఆత్మస్థైర్యాన్ని దేశం యావత్తూ కొనియాడింది. పోలీసుల దగ్గరకు ధైర్యంగా వెళ్లి, ఘటనపై భావన ఫిర్యాదు చేసిన తీరును యావత్ సినీ ప్రముఖులు అభినందించడమే కాకుండా ఆమెకు మద్దతు పలికారు.
 
 ఆ ఘటనపై భావన వివరంగా మీడియాతో పంచుకున్నారు. తప్పు చేసినోళ్లకు తప్పించుకునే అవకాశం ఎందుకివ్వాలన్నదే ఆ సమయంలో తన మనసులో ఉండిందని, నేరం చేసినవాళ్లే సిగ్గుపడి బతకాలి తప్పితే నేరచర్యకు గురైన మహిళలు కాదు అని పేర్కొన్నారు. నాకు జరిగిన అవమానంపై నేను సైలెంటుగా ఉంటే నాకు దగ్గరి సన్నిహితులు ఓ అయిదారుమందికి మాత్రమే తెలిసేది కానీ నలుగురిలో ఆ ఘటన గురించి మాట్లాడలేదనే అపరాధం జీవితాంతం నన్ను బాధించేది.  తప్పు చేసినాననే బాధతో ఎన్నో నిద్రలేని  రాత్రులు గడపాల్సి వచ్చేది. అందుకే ఫిర్యాదు చేశా, ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టను అని భావన పేర్కొన్నారు.
 
నేను చేయని తప్పుకు నా శత్రువులకు ఎప్పుడూ క్షమాపణలు చెప్పను. రాజీపడి పదేపదే క్షమాపణలు చెప్పే బదులు... అహంకారిగా ముద్ర వేయించుకోడమే నాకిష్టం’’ అన్నారు నటి భావన. నిజంగానే ఆ అహంకారం జాతి చైతన్యాన్ని మేల్కొలిపే అహంకారం. అన్యాయానికి గురైన ప్రతి ఒక్క మహిళను తలెత్తుకు తిరిగేలా చేసే అహంకారం. చెడు కోసం కాకుండా మంచికోసం వ్యక్తీకరించబడుతున్న ఆ అహంకారం బాధితులకు ఉండాల్సిందే. 
 
అందుకే భావనకు సెల్యూట్ చెప్పాలి.