శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 21 జులై 2019 (13:22 IST)

హౌస్‌లోకి వెళ్తున్నా... మీరే గెలిపించాలి... సినీ నటి హేమ

ప్రముఖ టీవీ చానెల్లో బిగ్ బాస్-3 సీజన్ ప్రసారంకానుంది. దీనికి హోస్ట్‌గా కింగ్ నాగార్జున వ్యవహరించనున్నారు. పైగా, ఈ షోలో పాల్గొనే వారి పేర్లపై పూర్తి స్థాయి క్లారిటీ మాత్రం రాలేదు. కానీ, సినీ నటి హేమ మాత్రం ఓ క్లారిటీ ఇచ్చింది. ఓ రియాల్టీ షో హౌస్‌కి వెళ్తున్నానని, అక్కడ ఎన్ని రోజులు ఉంటానో తనకు తెలియదని చెప్పుకొచ్చింది. అయితే, ఈ షోలో తూర్పుగోదావరి జిల్లా వాసులు గెలిపించాలని విజ్ఞప్తి చేసింది. 
 
అయితే, తన కుటుంబాన్ని వదిలి హేమ ఉండగలదా? లేదా? ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు? అనే విషయాలపై ఇపుడే చెప్పలేం. ఈ రియాల్టీ షో కార్యక్రమం జూలై 21వ తేదీ ఆదివారం నుంచే ప్రసారంకానుంది. ఇదిలావుంటే, తాను త్వరలోనే రాజమహేంద్రవరంలో ఇల్లు తీసుకుంటానని, ఇకపై ఇక్కడే ఉండి, ప్రజలకు సేవ చేస్తానని హేమ ఈ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. ఒకసారి తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చానని, మరోసారి రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఇక సినిమాలు చేయబోనని స్పష్టంచేసింది.