ఛీ..ఛీ.. ఏంటీ బూతు ట్రైలర్... స్టేజ్ మీదే డైరెక్టర్‌ని తిట్టేసిన జీవిత...
సినీ నటి జీవితను ఓ ఫంక్షన్‌కి అతిథిగా పిలిచారు. ఆ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది. జనరల్‌గా ట్రైలర్ సూపర్‌గా ఉంది. ఈ సినిమా సూపర్ సక్సస్ అవ్వడం ఖాయం. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇలా పొగడ్తలతో ముంచెత్తుతుంటారు. అయితే... వీటికి భిన్నంగా జరిగింది. ఇంతకీ ఏం జరిగింది అంటే.. ట్రైలర్ చూడగానే... జీవితకు బాగా కోపం వచ్చింది.
అంతే... స్టేజ్ మీదే డైరెక్టర్‌ని తనదైన శైలిలో తిట్టేసింది. ఇంతకీ అది ఆ ఫంక్షన్ ఏంటంటారా..? డిగ్రీ కాలేజ్. ఈ మూవీ డైరెక్టర్ నరసింహ నంది. ఆ ట్రైలర్ నిండా బూతులే. పైగా శృంగారం డోసు మరింత ఎక్కువగా ఉంది. అది చూసిన జీవితకు కోపం వచ్చింది. గతంలో మీరు మంచి సినిమాలే తీసారు కదా.. ఇప్పుడేంటి ఇలాంటి బూతు సినిమా తీసారు..?
తీసి నన్ను అతిథిగా పిలుస్తారా అంటూ దర్శకుడ్ని నిర్మాతనీ స్టేజీ పైనే కడిగేసింది. దాంతో దర్శకనిర్మాతలు జీవితకు సర్దిచెప్పలేక నానా ఇబ్బందీ పడ్డారు. ముక్తసరిగా నాలుగు మాటలు మాట్లాడేసి అక్కడి నుంచి వచ్చేసింది జీవిత. ఇక నుంచి ట్రైలర్ రిలీజ్‌కి రమ్మంటే.. ముందుగా ట్రైలర్ చూపించండి అంటుందేమో..!