శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 22 జూన్ 2017 (17:33 IST)

రేటింగ్‌ల కోసం పిచ్చిరాతలు... మీడియాను కడిగేసిన జీవిత రాజశేఖర్

హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని శ్రీనివాస్ ఎంటర్‌ప్రైజెస్ కార్యాలయంపై దాడి చేసిన సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ.7 కోట్ల విలువైన పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌తో పాటు

హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని శ్రీనివాస్ ఎంటర్‌ప్రైజెస్ కార్యాలయంపై దాడి చేసిన సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ.7 కోట్ల విలువైన పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌తో పాటు రవి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు నటి జీవిత సోదరుడని వార్తలు వచ్చాయి. 
 
దీనిపై జీవిత స్పందించారు. శ్రీనివాస్ అనే వ్యక్తి తమ వద్ద పని చేస్తారని, రవి ఎవరో తమకు తెలియదన్నారు. ఈ ఘటనతో తను సోదరుడికి సంబంధం లేదని చెప్పారు. తన సోదరుడు మురళీ శ్రీనివాస్ కిడ్నీ మార్పిడి చికిత్స జరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కావాలంటే ఆస్పత్రికెళ్లి చెక్ చేసుకోవచ్చన్నారు. ఇపుడు అరెస్టు అయిన శ్రీనివాస్ అనే వ్యక్తి తమ సినిమాలకు ఉన్న అనేక మంది మేనేజర్లలో ఒకరని చెప్పారు. 
 
అసలు తమ గురించి ఒక వార్త రాసే ముందు తనను వివరణ అడిగి ప్రచురిస్తే చాలా మంచిదన్నారు. కానీ, వార్తను ప్రసారం చేసి.. ఆ తర్వాత తన వద్దకు వచ్చి వివరణ కోరడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ముఖ్యంగా.. తామంటే మీడియాకు అంత ఇష్టమో అర్థం కావడం లేదన్నారు. రేటింగ్‌ల కోసమే ఇలాంటి పిచ్చిరాతలు రాస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. 
 
పాత కరెన్సీ స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో ఒక్క పోలీసులు కూడా తమను ఇంతవరకు సంప్రదించలేదన్నారు. రూ.7 కోట్ల నగదు పట్టుబడితే తమను ఊరికే వదిలివేస్తారా? అంటూ మీడియాను నిలదీశారు. పైగా, శ్రీనివాస్ ఎంటర్‌ప్రైజెస్ భవనం తమదేనని చెప్పుకొచ్చిన ఆమె.. ఈ భవనం యజమాని విదేశాల్లో ఉంటున్నారని చెప్పారు. ఏది ఏమైనా ఒకరి గురించి వార్తను ప్రసారం చేసేముందు ఆ వార్తతో పాటు.. తమ వివరణ తీసుకుని వేస్తే బాగుంటుందని ఆమె కోరారు. 
 
పైగా, ఇప్పడు పాత నోట్ల వ్యవహారంలో పట్టుబడిన శ్రీనివాస్ తనకు సోదరుడని, బంధువని వస్తున్న వార్తలు నిజం కాదని ఆమె స్పష్టం చేశారు. తన దగ్గర పనిచేస్తున్న మేనేజర్స్‌లో శ్రీనివాస్ కూడా ఒకడని, అంతేతప్ప అతడితో తనకు ఎలాంటి సంబంధంలేదని ఆమె చెప్పారు.