శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 5 నవంబరు 2016 (10:55 IST)

చిరంజీవితో మాత్రం నటించాలని వుంది: నటి కస్తూరి

మెగాస్టార్ చిరంజీవితో నటించాలని ప్రముఖ నటి కస్తూరి తన మనసులోని మాటను బయటపెట్టింది. ‘భారతీయుడు’ చిత్రంలో ప్రముఖ నటుడు కమలహాసన్‌కు చెల్లెలుగా, ‘అన్నమయ్య’ చిత్రంలో నాగార్జున సరసన నాయికగా నటించిన విషయం తె

మెగాస్టార్ చిరంజీవితో నటించాలని ప్రముఖ నటి కస్తూరి తన మనసులోని మాటను బయటపెట్టింది. ‘భారతీయుడు’ చిత్రంలో ప్రముఖ నటుడు కమలహాసన్‌కు చెల్లెలుగా, ‘అన్నమయ్య’ చిత్రంలో నాగార్జున సరసన నాయికగా నటించిన విషయం తెల్సిందే. 
 
ఈమె తాజాగా ఓ న్యూస్ ఛానెల్‌‍కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కమల్‌తో నటించడమంటే ఎంతో భాగ్యం చేసుకున్నట్లుగా భావిస్తున్నానని చెప్పింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో నటించాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. 
 
అలాగే, తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌తో నటించే అవకాశం తనకు దక్కలేదని, ఆ అవకాశం ఇకపై వస్తుందని కూడా తాను భావించడం లేదని వ్యాఖ్యానించింది. కాగా, 'భారతీయుడు' చిత్రంలోని ‘పచ్చని చిలుకలు తోడుంటే..’ అనే పాటలో కమల్‌తో ఆడిపాడే కస్తూరిగా ప్రేక్షకుల మదిలో ఆమె గుర్తుండిపోయింది.