శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 28 జూన్ 2016 (14:07 IST)

చిత్రాల్లో నటించేందుకు కండిషన్ పెడుతోన్న రమ్యకృష్ణ.. ఎందుకో తెలుసా?

వయసులో ఉండగా, తన అందచందాలతో ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్ రమ్యకృష్ణ. టాలీవుడ్‌లో 'ఐరెన్ లెగ్' హీరోయిన్ అని ముద్ర వేయించుకుని ఆ తర్వాత టాప్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా చెలామణి అయింది.

వయసులో ఉండగా, తన అందచందాలతో ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్ రమ్యకృష్ణ. టాలీవుడ్‌లో 'ఐరెన్ లెగ్' హీరోయిన్ అని ముద్ర వేయించుకుని ఆ తర్వాత టాప్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా చెలామణి అయింది. హీరోయిన్‌గా ఎంత పాపులారిటీ సంపాదించిందో... వయసు మీరిన తర్వాత ప్రారంభించిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో అంతే పాపులారిటీని సొంతం చేసుకుంది. అమ్మ, అత్త పాత్రలతో వెండితెరపై ఇరగదీస్తోంది. ఫలితంగా టాలీవుడ్‌లో బిజీ ఆర్టెస్టుగా మారిపోయింది.
 
ఆమె తాజాగా నటించిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'. ఈ చిత్రంలో చిన్న నాగార్జునకు అమ్మ పాత్రలో నటించినా.. అమ్మాయి (హీరోయిన్)ని తలదన్నేలా నటించింది. ఈ చిత్రంలో రమ్య నటన ప్రతి ఒక్కరినీ ఇట్టే ఆకట్టుకుంది. ఫలితంగా ఆమెకు ఆఫర్లపై ఆఫర్లు వస్తున్నాయి. 
 
అయితే, 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం తర్వాత పలు ఆఫర్లు వచ్చినప్పటికీ.. వీటిని అంగీకరించేందుకు ఓ కండీషన్ పెడుతోందట. తాను అమ్మ, అత్త పాత్రలు చేసినప్పిటకీ.. తనను మాత్రం ఆ పాత్ర పేరుతోనే పిలవాలన్న కండీషన్ అది. 'సోగ్గాడే చిన్న నాయనా' చిత్రంలో కూడా రమ్యకష్ణను నాగార్జున సత్య అని పేరు పెట్టిపిలిచారే గానీ, ఎక్కడ కూడా అమ్మా అని పిలవలేదు. 
 
ఇపుడు నవరస నాయకుడు కమల్ హాసన్ సరసన "శభాష్ నాయుడు" చిత్రంలో ఆయన భార్యగా నటిస్తోంది. ఇందులో శృతిహాసన్ కూడా నటిస్తోంది. ఈ సినిమాలో కూడా అమ్మా అని పిలవకూడదన్న కండిషన్ పెట్టిందట. మొత్తానికి తనకు వయసుమీద పడుతున్నా.. చిత్రాల్లో అమ్మ, అత్త పాత్రలు చేస్తున్నా కూడా ఆమెను మాత్రం ఆ పేర్ల మీద పిలవకూడదని నిబంధన పెడుతోంది.