నా కంట్లో కన్నీరు ఇంకిపోయింది.. తీసుకెళ్లమని దేవుడిని ప్రార్థించా... సంజనా గల్రానీ

sanjana
ఠాగూర్| Last Updated: ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (11:48 IST)
కన్నడ చిత్రపరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన హీరోయిన్లలో సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదిలు ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరు కోర్టు బెయిలుపై జైలునుంచి బయటకు వచ్చారు. అయితే, జైలు నుంచి విడుదలైన సంజనా గల్రానీ తాజాగా మీడియాతో మాట్లాడారు.

"నేను కొన్ని నెలలుగా ఏడుస్తూనే ఉన్నాను. నా కంట్లో కన్నీరు కూడా ఇంకిపోయిందేమో. నన్ను ఇంతగా కష్టపెట్టే బదులు తీసుకెళ్లి పొమ్మని భగవంతుడిని ప్రార్థించాను" అని చెప్పుకొచ్చింది.

తాను వెళుతున్న మార్గం చాలా రఫ్‌గా ఉంటుందని తనకు తెలిసిందని, దాన్ని దాటేసి, తిరిగి ఎప్పటిలా పైకి ఎగరాలనుందని ఆమె చెప్పింది. భారత న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుందని తెలిపింది.

తనకు లాక్డౌన్ సమయంలో నిశ్చితార్థం జరిగిందని చెప్పారు. లాక్డౌన్ కారణంగా నిశ్చితార్థాన్ని ప్రకటించలేకపోయానని, ఇప్పుడు వివాహాన్ని కూడా చిన్న వేడుకలా మాత్రమే చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఏదైనా చారిటబుల్ ట్రస్టులో తమ పెళ్లి జరుగుతుందని సంజన వ్యాఖ్యానించింది.దీనిపై మరింత చదవండి :