శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 5 జూన్ 2018 (12:56 IST)

'కొత్త బంగారులోకం' హీరోయిన్‌కు నిశ్చితార్థం జరిగిపోయింది...

'కొత్త బంగారులోకం' చిత్రంతో మంచి గుర్తింపు పొందిన హీరోయిన్ శ్వేతా బసుప్రసాద్. ఈమె తన స్నేహితుడైన రోహిత్ మిట్టల్‌ను పెళ్లాడనుంది. తామిద్దరికీ నిశ్చితార్థం జరిగినట్టు చెప్పుకొచ్చింది శ్వేతాబసు. రోహిత్ మిట్టల్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ఫిల్మ్ మేకర్.

తనను పెళ్లాడాలని తొలుత తనే రోహిత్‌‌కు ప్రపోజ్‌ చేశాననీ, ఐతే అతను కొన్నాళ్ల పాటు మౌనంగా వున్నాడని వెల్లడించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తన అంగీకారం తెలిపాడనీ, దాంతో ఇరు కుటుంబాలు తమ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పింది. అయితే తమ వ్యక్తిగత విషయాలు వెల్లడించడం ఇష్టం లేకనే తమ నిశ్చితార్థం వార్తను బయటి ప్రపంచానికి చెప్పలేదని శ్వేతా తాజాగా చెప్పుకొచ్చింది. 
 
కాగా, ఇటీవలికాలంలో హీరోయిన్లు రహస్యంగా పెళ్లే కాదు నిశ్చితార్ధాలు కూడా చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న బాలీవుడ్ నటి నేహా ధుపియా తన బాయ్‌ఫ్రెండ్‌ను రహస్యంగా వివాహం చేసుకుంది. ఈ కోవలోనే శ్వేతా బసు ప్రసాద్ తన స్నేహితుడుని పెళ్లాడనుంది.