శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (15:54 IST)

విక్రమ్ సార్‌తో చేస్తానని అనుకోలేదు.. కోబ్రాపై శ్రీనిధి శెట్టి

'కేజీఎఫ్ 2' తరువాత శ్రీనిధి శెట్టి చేసిన సినిమాగా ఈ నెల 31వ తేదీన 'కోబ్రా' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయమై శ్రీనిధి మాట్లాడుతూ.."కోబ్రా అనగానే నాకు విక్రమ్ సార్ గుర్తుకు వస్తారు. తమిళంలో నా మొదటి సినిమాను విక్రమ్ సార్‌తో చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇంత పెద్ద బ్యానర్లో.. ఆయన కాంబినేషన్‌లో చేసే ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా పాత్ర మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది" అని అన్నారు.    
 
విక్రమ్ సార్ ఈ చిత్రంలో చాలా గెటప్పుల్లో కనిపిస్తారని.. కానీ ఆయన నా జోడీ కట్టిన గెటప్పు ఏదైతే ఉందో అదే నాకు నచ్చుతుంది. విక్రమ్ సార్, రెహ్మాన్ సార్, మా డైరెక్టర్ గారు, మంచి కథ ఈ సినిమా హైలైట్స్‌గా చెబుతాను. ఈ నెల 31న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తప్పకుండా చూడండి" అంటూ చెప్పుకొచ్చారు.