మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2022 (11:59 IST)

మాట్లాడగలుగుతున్న నటి శ్రీవాణి.. అందరికీ చాలా థ్యాంక్స్‌

SriVani
SriVani
తెలుగు బుల్లితెర నటి శ్రీవాణి మాట్లాడగలుగుతోంది. గత నెలలో ఆమె అరుదైన వ్యాధి బారిన పడింది. దీని కారణంగా ఆమె గొంతు తాత్కాలికంగా మూగబోయింది. తాజాగా ఆమె తీసుకున్న చికిత్స సక్సెస్ అయ్యింది. దీంతో ఆమె మళ్లీ ఎప్పటిలా మాట్లాడగలుగుతోంది. 
 
ఈ విషయాన్ని హర్షం వ్యక్తం చేసింది. ఇంకా యూట్యూబ్‌లో వీడియో వదిలింది. డాక్టర్‌ సూచన మేరకు జూలై 19 నుంచి ఆగస్టు 19 వరకు అస్సలు మాట్లాడలేదు. కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తోనే మాట్లాడేశా. ఈ సమయంలో నాకోసం ఎంతోమంది ప్రార్థించారు. వారందరికీ చాలా థ్యాంక్స్‌ అని చెప్పుకొచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘వెల్ కమ్ బ్యాక్ మేడమ్’, ‘మీ వాయిస్ విన్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.