సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (15:23 IST)

బిగ్ బాస్ ఆరో సీజన్.. అగ్ర హీరోయిన్స్ డ్యాన్సులు అదిరిపోతాయట...

Bigg boss
బిగ్ బాస్ కోసం నిర్వాహకులు భారీ స్థాయిలోనే ఖర్చు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. గడిచిన ఐదు సీజన్స్‌కు కూడా పెట్టిన పెట్టుబడికి కూడా మంచి రేటింగ్స్ అందుకుంటూ లాభాలను గడించారు. 
 
అందుకే ఎన్ని కాంట్రవర్సీలు క్రియేట్ అయిన బిగ్ బాస్ నిర్మాణ సంస్థ మాత్రం ఖర్చుకు ఏ మాత్రం వెనుక పడకుండా ఈ షోను కొనసాగిస్తోంది. అలాగే కంటెస్టెంట్స్ అందరికీ కూడా అడిగినంత పారితోషికం ఇవ్వడానికి కూడా నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.
 
గతంలో ఎప్పుడు లేనివిధంగా రెండు కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈసారి హౌస్ లో అత్యధిక టెక్నాలజీతో కెమెరాలను ఫిక్స్ చేయబోతున్నారు. 
 
ఇక మొదటి ఎపిసోడ్‌లో ప్రత్యేకంగా డాన్స్‌చేసే అగ్ర హీరోయిన్స్‌ను కూడా రంగంలోకి దింపుతున్నారు. కాబట్టి వారికి కూడా భారీ స్థాయిలోనే ఫీజులు అందబోతున్నాయి.