మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (20:33 IST)

పేపర్ డ్రస్సులో 'హార్ట్ అటాక్' భామ... అబ్బ ఏముందిలే...

ఈ మధ్య హీరోయిన్లు డ్రస్సులతో వార్తలలో నిలుస్తున్నారు. నిస్సంకోచంగా అందాల ఆరబోతకు సై అంటున్నారు. సినిమాలలోనే కాకుండా బయట అటెండ్ అయ్యే ఈవెంట్‌లకు కూడా ఓ రేంజ్‌లో వస్తున్నారు. ఇక తమ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలలో అడపాదడపా పిక్స్ పోస్ట్ చేస్తూ పిచ్చెక్కిస్తున్నారు. 
 
'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆదా శర్మ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన హాట్ హాట్ చిత్రాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ముంబైలో నిర్వహించిన నైకా ఫెమీనా బ్యూటీ అవార్డ్స్ 2019 కార్యక్రమానికి హాజరైన ఆదా శర్మ పేపర్‌తో తయారు చేసిన ఈ వెరైటీ కాస్ట్యూమ్‌తో రెడ్ కార్పెట్‌పై నడిచారు. 
 
ఆ వేడుకలో అందరి కంటే ప్రత్యేకంగా కనిపించాలని డిజైన్ చేయించుకుని మరీ వేసుకుందట ఈ డ్రస్సు. ఇందులో మరో విశేషముందండోయ్, తన క్లీవేజ్ షోతో మతి పోగొట్టేలా ధరించిన ఈ డ్రస్సు పేపర్ మాదిరిగా కనిపించినా అసలైన పేపర్‌తో కాకుండా అలా కనిపించే ఫ్యాబ్రిక్‌తోనే తయారు చేసారు. ఇక ఈ డ్రస్సు చూసిన తెలుగువారు ఒక్కసారిగా "అహ నా పెళ్లంట" సినిమాను గుర్తు చేసుకున్నారు.