చిరంజీవి అభిమానిగా యంగ్ హీరో.. టైటిల్ 'నా పేరే రాజు
అదిత్ అరుణ్ (తుంగభద్ర ఫేమ్) తదుపరి చిత్రం టైటిల్ మెగాస్టార్ సూపర్ హిట్ సాంగ్ “నా పేరే రాజు”... ఈ చిత్రంలో చిరు అభిమానిగా నటిస్తున్నారు... ఈ చిత్రానికి మారుతి దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన వెంకటేష్ త్ర
అదిత్ అరుణ్ (తుంగభద్ర ఫేమ్) తదుపరి చిత్రం టైటిల్ మెగాస్టార్ సూపర్ హిట్ సాంగ్ “నా పేరే రాజు”... ఈ చిత్రంలో చిరు అభిమానిగా నటిస్తున్నారు... ఈ చిత్రానికి మారుతి దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన వెంకటేష్ త్రిపర్ణ తొలిసారిగా క్లాసిక్ క్రియేషన్స్ బ్యానర్‌లో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వి.రాజా రెడ్డి నిర్మాతగా మారుతున్నారు.
ఈ సినిమా షూటింగ్ వచ్చేనెల మొదటి వారంలో హైదరాబాద్, వైజాగ్, కేరళ, కర్ణాటక, చెన్నైలలో జరగబోతుంది. దీనిపై నిర్మాత వి.రాజా రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా అదిత్ అరుణ్ కెరీర్‌లోనే అతి పెద్ద విజయం సాదిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. సినిమాకి సంబంధించిన నటీనటులను, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
నిర్మాత వి.రాజా రెడ్డి, చిత్ర బృందం లెజండరీ యాక్టర్ పద్మ భూషణ్ మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నటిస్తున్న 150వ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.