1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 4 అక్టోబరు 2016 (16:56 IST)

స్క్రిప్ట్ చూస్తే ఏదో వెలితిగా ఫీలైందట... అందుకే రణ్‌బీర్‌తో ఐష్ కెమిస్ట్రీ పండించిందట!

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కోడలు, ఓ బిడ్డకు తల్లి అయిన ఐశ్వర్యారాయ్ సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించి నటిస్తున్న చిత్రం యే దిల్‌ హై ముష్కిల్‌’. ఇందులో రణ్‌బీర్ సరసన నటిస్తోంది. అయితే, ఈ చిత్రంల

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కోడలు, ఓ బిడ్డకు తల్లి అయిన ఐశ్వర్యారాయ్ సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించి నటిస్తున్న చిత్రం యే దిల్‌ హై ముష్కిల్‌’. ఇందులో రణ్‌బీర్ సరసన నటిస్తోంది. అయితే, ఈ చిత్రంలో హీరోతో ఐష్ పండించిన కెమిస్ట్రీ ఎంతో మందిని ఆశ్చర్యపరుస్తోందట. 
 
నిజానికి ఈ చిత్రంలో ఐష్ పాత్రపై చర్చ జరిపినపుడు అలాంటి సీన్లు లేవట. కానీ, ఐశ్వర్యారాయ్ చిత్ర కథను చదువుతున్నపుడు మాత్రం ఆమెకే ఏదో తెలియని వెలితిగా అనిపించిందట. అందుకే ఈ పాత్రను వీలైనంత బోల్డ్‌గా మార్చాలని దర్శకుడు కరణ్ జోహార్‌, నిర్మాతకు సూచించిందట. 
 
ఏకంగా ఐష్‌ నుంచి అలాంటి సూచనలు వచ్చాక.. దర్శకనిర్మాతలు మాత్రం మిన్నకుండిపోతారా ఏంటి? దీంతో చిత్ర యూనిట్‌ సాధ్యమైనన్ని శృంగార సన్నివేశాలు ఇరికించిందట. నిజం చెప్పాలంటే ఆ సన్నివేశాల్లో ఐష్‌ నటించిన తీరు చూసినవారెవరికీ ఆమె వయసు 40 సంవత్సరాలని, ఓ బిడ్డకు తల్లిని అనిపించదు. ఈ వయసులో కూడా ఘాటైన శృంగార దృశ్యాల్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచిందీ నీలికళ్ల సుందరి.