శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 మార్చి 2017 (13:15 IST)

మా సోదరుడు ఉత్తముడు.. సుచీ లీక్స్‌పై ధనుష్ సోదరి గీత ఎమోషనల్ పోస్ట్

సుచీ లీక్స్‌పై తమిళ హీరో ధనుష్ సోదరి గీత ఓ ఎమోషనల్ పోస్ట్‌ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. హీరోయిన్ త్రిషతో ధనుష్ క్లోజ్‌గా ఉన్న ఫోటోలు నెట్‌లో సంచలనంగా మారాయి. దీనిపై ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో

సుచీ లీక్స్‌పై తమిళ హీరో ధనుష్ సోదరి గీత ఓ ఎమోషనల్ పోస్ట్‌ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. హీరోయిన్ త్రిషతో ధనుష్ క్లోజ్‌గా ఉన్న ఫోటోలు నెట్‌లో సంచలనంగా మారాయి. దీనిపై ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని ధనుష్ కూడా సైలెంట్ అయిపోయాడు. అయితే ధనుష్ సోదరి విమల గీత తన ఫేస్‌బుక్ అకౌంట్లో ఈ వివాదాలన్నింటిపై ఓ పెద్ద నోటే రాసింది. అయితే తన ఫేస్‌బుక్ అకౌంట్‌ను కూడా ఆమె తొలగించింది. ఇంతకీ ఆమె ఏం రాసిందంటే...
 
"గత కొన్ని నెలలుగా మా కుటుంబం రకరకాల వివాదాలతో బాధపడుతోంది. అయినా మా కుటుంబం మౌనంగానే ఉంది. మాది ఒకప్పుడు చాలా పేద కుటుంబం. కానీ ఒక వ్యక్తి కష్టంతో మేమీరోజూ ఉన్నత స్థితిలో ఉన్నాం. జీవిస్తున్నాం. తేనీ జిల్లాలోని ఓ చిన్న గ్రామానికి చెందిన మా కుటుంబం ఎన్నో బాధలను అనుభవించింది. మా సోదరులు ఎన్నో అవమానాలను భరించారు. 
 
మా కుటుంబం ఎలాంటి విలువలకు కట్టుబడి బతికిందో, బతుకుతోందో ఆ భగవంతుడికి తెలుసు. ఈరోజున ధనుష్ పెద్ద స్టార్. కానీ ఈ స్థాయికి రావడానికి అతను ఎంత కష్టపడ్డాడో తోడబుట్టినదానిగా నాకు తెలుసు. మనుషుల క్యారెక్టర్‌ను తప్పుబట్టడం మీడియాకే సాధ్యం. కానీ తమిళ ప్రజలకు, అభిమానులకు బాగా తెలుసు. ధనుష్ సినిమాల్లో నటిస్తూ ఎన్ని బాధలు పడ్డాడో, అవన్నీ కనిపించకుండా వాళ్లను ఎంతగా అలరించాడో.
 
ఈ మధ్య ట్విట్టర్ అనేది ఏదైనా మాట్లాడానికి, ఏదైనా పోస్ట్ చేయడానికి వేదికగా మారింది. ఫేక్ పోర్న్ వీడియోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసేంత స్థాయికి కొందరు దిగజారారు. ఇక్కడ మరింత అభ్యంతరకర విషయమేంటంటే ఆ ఫేక్ వీడియోల గురించి మా కుటుంబాన్ని ప్రశ్నించడం. మా కుటుంబం అన్నీ గమనిస్తోంది. ఈ వ్యవహారంపై పోరాడటానికి మేం సిద్ధంగా ఉన్నాం. 
 
చాలా బాధతో, అసహనంతో ఫేస్‌బుక్‌కు, ట్విట్టర్‌కు నేను వీడ్కోలు పలుకుతున్నాను. నేను చెబుతోంది ఏ ఒక్కరినీ ఉద్దేశించి కాదు. ఎవరు ఇదంతా చేస్తున్నారో, ఇకనైనా ఆపండి. మీ చర్యల వల్ల ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే వారి ప్రాణాలను తిరిగి తీసుకురాగలరా... ముఖ్యంగా మహిళల గురించి. బ్రతకండి, బ్రతకనివ్వండి. గాడ్ బ్లెస్ అండ్ గుడ్ బై" అంటూ ట్వీట్ చేశారు.