అఖిల్ 4వ సినిమా స్టార్ట్.... ఇంతకీ హీరోయిన్ ఎవరు..?
అఖిల్ నటించిన మూడు సినిమాలు ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో.. ఈసారి చేసే నాలుగవ సినిమాపై అఖిల్‌తో పాటు అభిమానులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. చాలా కథలు విని ఆఖరికి బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన కథకి ఓకే చెప్పడం.. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుండడం తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఎప్పుడో జరుపుకున్నప్పటికీ.. హీరోయిన్ ఎవరనేది ఫైనల్ కాకపోవడంతో ఇన్నాళ్లు సెట్స్ పైకి వెళ్లలేదు.
ఈ రోజు ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో షూటింగ్ చేస్తున్నారు. ఓ పది రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందట. షూటింగ్ అయితే స్టార్ట్ చేసారు కానీ... హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ చేయలేదట. కొత్త అమ్మాయినే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారట. సెకండ్ షెడ్యూల్ నుంచి నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీవాసు,వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ రెండు ఇంట్రస్టింగ్ టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారట. సాధ్యమైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి ఈ ఇయర్ ఎండింగ్‌లో రిలీజ్ చేయలనుకుంటున్నారని తెలిసింది.