సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: బుధవారం, 18 ఏప్రియల్ 2018 (22:36 IST)

సావిత్రి చేతుల్లో నేటి స్టార్ హీరో ఎవ‌రో తెలుసా..?

అల‌నాటి న‌టి సావిత్రి జీవిత క‌థ‌తో మ‌హాన‌టి అనే సినిమా రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వైజ‌యంతీ మూవీస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ చిత్ర టైటిల్‌ రోల్‌లో

అల‌నాటి న‌టి సావిత్రి జీవిత క‌థ‌తో మ‌హాన‌టి అనే సినిమా రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వైజ‌యంతీ మూవీస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ చిత్ర టైటిల్‌ రోల్‌లో కీర్తిసురేష్ నటిస్తుంది. సమంత, విజయ్ దేవరకొండ, షాలినీ పాండే మొదలగువారితో పాటు మహామహులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి సంబంధించి తాజాగా విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వస్తున్న విషయం తెలిసిందే. అయితే సావిత్రిగారు ఓ బాబుని ఎత్తుకుని ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో ఉన్న హీరో ఎవరో కాదు. కింగ్ నాగార్జున. వెలుగు నీడలు చిత్రంలో కింగ్ నాగార్జున నటించారు. 
 
చిన్నతనంలో ఉన్న నాగార్జునని సావిత్రమ్మ ఎత్తుకుని జోలపాడుతున్న ఫొటోని ఓ నెటిజన్ నాగార్జునకు షేర్ చేశాడు. ఈ ఫొటో షేర్ చేసిన నెటిజన్‌కి నాగార్జున థ్యాంక్స్ చెబుతూ.. ఈ ఫొటో వెలుగు నీడలు అనే చిత్రంలోనిది అంటూ నాగార్జున తన మధురమైన జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. అంతకుముందు మహానటి టీజర్ పైన నాగార్జున ప్రశంసల వర్షం కురిపించారు. మ‌హాన‌టి సినిమా మే 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.